Telugu Badi

         మన లక్ష్యములు

        ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను నేర్చుకోవడానికి గల అవకాశాలను పెంపొందించడం మరియు

        ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని భాషా పరంగా మరియు సాంస్కృతికంగా ఉత్తేజ పరచడం

         మన మార్గం

        అంతర్జాతీయ బోధనా పద్ధతిలో, అంతర్జాతీయ బాల శిక్ష పాఠ్య పుస్తకాలను, ప్రణాళికలను తయారు చేసి మరియు ఉపాధ్యాయులకుతగిన శిక్షణ నొసగి, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు బడుల నిర్వహణకు సహకరించడం

        తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని, అందరి సహకారంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక పద్ధతులను మరియు అధునాతనఉపకరణాలను ఉపయోగించి బోధించడం

        ప్రవాసంలోను మరియు మాతృభూమి లోను తెలుగు భాషాభివృద్ధికి మరియు తెలుగు వారి అభివృద్ధికి తోడ్పడడం

        తెలుగు భాషను, సంస్కృతిని, విలువలను మరియు సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరివ్యాప్తి చేయడం

..తద్వారా మన లక్ష్యాలను సాధించడం

         మైలు రాళ్ళు

        1992-2004

         ఇతర తెలుగు బడులలో పని చేయుట మరియు సామాజిక కార్య కర్తలు, తెలుగు బడి టీచర్ల నుండి నేర్చుకొనుట

        2004

         ఆస్టిన్ హిందూ మందిర నిర్మాణ, నిర్వహణలో పాలుపంచుకొంటున్న స్వచ్చంద కార్య కర్తల ద్వారా ఆస్టిన్ తెలుగు బడికి నాంది

        2004-2007

         కార్య కర్తల ఇళ్లలో మరియు, మర్చిసన్ మిడిల్ స్కూల్ లో వారాంతపు తరగతుల నిర్వహణ

        2007-2008

         ఆస్టిన్ హిందూ మందిరంలో బాల విహార్ మరియు ఇతర విద్యా కార్య క్రమాల ద్వారా తెలుగు బడి తరగతుల నిర్వహణ

         ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘ కార్యక్రమాలలో తెలుగు బడి పిల్లల ప్రజ్ఞా ప్రదర్శనలు

        2009-2010

         అంతర్జాతీయ బాల శిక్ష�” ప్రణాళిక అభివృద్ధి.

         ప్రణాళికా బద్ధమైన సెమిస్టర్ విధానంలో తరగతుల నిర్వహణ

         విద్యా లక్ష్యములు, ప్రగతి సూచికల అభివృద్ధి.

         స్వచ్చంద బోధనకు తల్లి దండ్రుల మరియు ఉపాధ్యాయుల సహకారం

         ఉత్తర ఆస్టిన్ మేథ్ నేషియంలో వారపు తరగతుల ప్రారంభం

         అట్లాంటా, చికాగో, డాలస్ నగరాలలో మరియు ఆస్టిన్ దక్షిణ ప్రాంతలో క్రొత్త తెలుగు బడుల ప్రారంభం

         ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘ ఉగాది కార్యక్రమంలో తెలుగు బడి పిల్లల నాటక ప్రదర్శన

         వార్షికోత్సవము మరియు వార్షిక పద్య పఠనం పోటీల ప్రారంభం

        2010-2011

         అంతర్జాతీయ బాల శిక్ష�” ప్రణాళిక విస్తరణ

         ఉత్తర ఆస్టిన్ తెలుగు బడి లో బాచ్#2 ప్రారంభం

         అట్లాంటా, చికాగో, డాలస్ నగరాలలో మరియు ఆస్టిన్ దక్షిణ ప్రాంతలో క్రొత్త తెలుగు బడుల విస్తరణ

         రెండవ వార్షికోత్సవము మరియు వార్షిక పద్య పఠనం పోటీల విజయం  దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు మరియు అతిథులు హాజరు.