Telugu Badi

“తెలుగు మన మాతృభాష! తల్లి తండ్రులే మన ప్రథమ గురువులు!!” 

అనే నినాదంతోఅమెరికా లోని ఉత్సాహవంతులైన ప్రవాసాంధ్ర  తల్లి దండ్రులచే ప్రారంభింప బడిన స్వచ్ఛంద సేవా సమితి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను నేర్చుకోవడానికి గల అవకాశాలను పెంపొందించడం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని భాషా పరంగా మరియు సాంస్కృతికంగా ఉత్తేజ పరచడం దీని లక్ష్యములు. సమితి విశేషాలనుప్రపంచ వ్యాప్తంగా నడుపబడుతున్న ఇతర అంతర్జాతీయ తెలుగు బడుల తాజా వివరాలను ఈ వెబ్ సైటు ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఆస్టిన్, అట్లాంటా, చికాగో మరియు చిన్మయబూమాంట్ లలో విజయవంతంగా నడుస్తున్న అంతర్జాతీయ తెలుగు బడుల వివరాలను, విశేషాలను, ఇక్కడ పొందు పరిచాము. అంతే కాక ఇతర తెలుగుబడులకు సహకరించే ఉద్దేశ్యంతో పద్యముల, పాటల, కథలను డౌన్ లోడ్ సెక్షన్ లో ఉంచాము. శ్రీ ఖర నామ సంవత్సర దసరా శుభాకాంక్షలతో, విజయ దశమి నాడు ఈ వెబ్ సైటు ఆవిర్భావం జరుగుతోంది. ప్రవాస భాషా యజ్ఞం లో మా వంతుగా చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందించి,  ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము.