Telugu Badi

తెలుగు నేర్చుకోవడం వ్యక్తిగత ఆసక్తి, శ్రద్ధ, నిరంతర అభ్యాసము మరియు అకుంఠిత దీక్షల ద్వారానే సాధ్యం. ముందు విద్యార్థి తగినంత శ్రద్ధాసక్తులు కలిగి ఉంటే గురువులైన తల్లి దండ్రులకి ఎంతో సంతోషంగా ఉండి మరిన్ని విషయాలను నేర్పించాలని అనిపిస్తుంది. నేర్చుకోవడానికి, అభ్యాసమునకు, వయసుతో, పరిసరాలతో పని లేదు, ఇది అనంత జీవన ప్రక్రియ.

తమ తమ భక్తి శ్రద్ధలతో, గురువులను-తల్లిదండ్రులను మెప్పించి, పట్టుదలతో తమ భాషా, సంస్కృతులను నేర్చుకొంటున్న చిరంజీవులందరికీ శుభాభినందనలు, ఆశీస్సులు. విద్య వినయాన్ని, వివేకాన్నీ పెంపొందిస్తుంది. వివేచనా ద్వారాలను తట్టి, విచక్షణా లోచనాలను తెరిపిస్తుంది. విజేత వెనుక ఉండేది అదృష్టమో, మంత్ర దండమో కాదు. చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. 
అంతర్జాతీయ తెలుగు బడి విద్యార్థులు

  • తెలుగులో పలకరిస్తారు, తెలుగులో మాట్లాడతారు
  • తెలుగు చదువుతారు, తెలుగులో వ్రాస్తారు
  • తెలుగు మాటల ఉచ్చారణ, అర్థం తెలుసుకొని పలుకుతారు
  • తెలుగు వారిని, తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తారు..

వారిని మన:స్ఫూర్తిగా ఆశీర్వదించి, అభినందించండి !!